జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా 2కె రన్

రంపచోడవరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం, పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని టూ కే రన్ కార్యక్రమం శుక్రవారం ఉదయం డీఎస్పీ సాయి ప్రశాంత్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ కులమత భేదాలు విడచి ఐక్యత, సోదరభావంతో జీవించాలని పిలుపునిచ్చారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, సమాజానికి ఉపయోగపడే మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్