రంపచోడవరం లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్

రంపచోడవరంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు మూర్ల బాలు రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని 12 మండలాల జట్లు పాల్గొన్న క్రికెట్ టోర్నమెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్‌టి కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో ఆడి, సోదరభావంతో పోటీలు నిర్వహించుకోవాలని, యువత క్రీడల ద్వారా దేశ గౌరవాన్ని పెంచాలని ఆయన సూచించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి స్నేహపూర్వకంగా క్రికెట్ ఆడారు.

సంబంధిత పోస్ట్