కూనవరం మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్, మాజీ పంచాయతీ కార్యదర్శి కలిసి ప్రజాధనం దోచుకున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆరోపించారు. గతంలో జరిగిన విచారణలో అవినీతి నిర్ధారణ అయినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోలేదని, అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేసి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.