జీడిపిక్కల ధరలకు రెక్కలు

అల్లూరి జిల్లాలో జీడిపిక్కల కొనుగోలు ధరలు గురువారం గణనీయంగా పెరిగాయి. అడ్డతీగల, కొయ్యూరు, రంపచోడవరం వంటి మండలాల్లో 80 కిలోల బస్తాను వ్యాపారులు రూ. 10,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం రూ. 10,000 ఉన్న ధర ఇప్పుడు పెరుగుతోంది. ఈ ఏడాది పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో జీడిపిక్కలకు డిమాండ్ పెరిగిందని రైతులు తెలిపారు. శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల వ్యాపారులు నేరుగా గ్రామాల్లో కొనుగోళ్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్