కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు: ఎమ్మెల్యే

రంపచోడవరం గంగవరం పాఠశాలలో ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి మాట్లాడుతూ, గత ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై పర్యవేక్షణతో ఉండాలని కోరారు. తమ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ వర్తింపజేస్తుందని, గత ప్రభుత్వంలో కేవలం ఒక్కరికే వర్తించేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నాణ్యమైన ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు అందిస్తుందని, వసతి గృహాల్లో అదనపు సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్