అడ్డతీగల మండలం మిట్లపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రంపచోడవరం నుంచి రాజవొమ్మంగి వెళుతున్న వాహనం, అడ్డతీగల నుంచి రంపచోడవరం వస్తున్న వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.