రబ్బర్ తోట రైతుల సమస్యలపై కలెక్టర్‌తో చర్చ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం పూజారిపాకలు గ్రామంలో, పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ రబ్బర్ తోట రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, మారేడుమిల్లి జడ్పీటీసీ సభ్యులు గొర్లె బాలాజీ బాబు మండల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.టీ. కమిషన్ మెంబెర్ గొర్లె సునీత కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్