ప్రత్యేక వైద్య శిబిరానికి విశేష స్పందన

రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి ఆధ్వర్యంలో సిరిగిందలపాడు గ్రామంలో ఆదివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిబిరంలో సుమారు 160 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 37 మందికి కంటి పరీక్షలు చేసి, 12 మందికి కళ్లజోళ్లు అందజేశారు. నలుగురిని శస్త్రచికిత్సల కోసం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్