జి. కొత్తపల్లిలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా మంచినీటి సదుపాయం

రాజవొమ్మంగి మండలం జి. కొత్తపల్లి గ్రామంలో సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 5 లక్షల వ్యయంతో గ్రావిటీ వాటర్ విధానంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. సంవత్సరాలుగా త్రాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యను గుర్తించి, ట్రస్ట్ సభ్యులు స్పందించి గ్రామంలో త్రాగునీటి టాప్‌లను ఏర్పాటు చేశారు. దీనితో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్