గంగవరం మండలంలోని బయ్యనపల్లి గ్రామంలో సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో విద్యుత్ తీగలు తెగి పడి, పాతర మల్లమ్మ, పాతర లక్ష్మి వారికి చెందిన రెండు తాటాకు ఇల్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని బాధితులు కోరారు.