శుక్రవారం రంపచోడవరం మండలం పెదగెద్దాడలో అగ్నిప్రమాదంలో పండ్ర కృష్ణ ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో, అదే గ్రామంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్పందించారు. వారు బాధిత కుటుంబానికి రూ. 24వేలు, ఒక రైస్ బ్యాగ్, పిల్లలకు యూనిఫాం అందజేశారు. ఈ సహాయకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, రాజేశ్వరరావు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.