రంపచోడవరం భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహనా కార్యక్రమం జరిగింది. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ & జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యం. మురళి గంగాధర రావు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేక విద్య అందించడం ఎంతో ముఖ్యమని, ఇలాంటి భవిత కేంద్రాలు ఏజెన్సీ ప్రాంతంలోని పిల్లలకు ఆశాకిరణమని పేర్కొన్నారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.