గ్రెజ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో కింగ్స్ జట్టు విజేత

చింతూరు డివిజన్ కేంద్రంలోని సంతపాకల క్రికెట్ గ్రౌండ్‌లో చింతూరు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రెజ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్–2లో కూనవరం కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. ఐపీఎల్ తరహాలో నిర్వహించిన ఈ టోర్నీలో లీగ్ దశ అనంతరం ఫైనల్‌కు చేరిన కూనవరం కింగ్స్, ఆర్‌జే స్ట్రైక్స్ జట్ల మధ్య జరిగిన తుదిపోరులో కూనవరం జట్టు 98 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలో ఛేదించింది. రామకృష్ణ దొర 5 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. విజేతలకు రూ. 50 వేలు, రన్నర్‌అప్‌కు రూ. 30 వేలు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్