మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరే కొనసాగించాలి

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా దానిని నిర్వీర్యం చేయాలనే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తోందని సీపీఐ ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా సహాయ కార్యదర్శి జుత్తుక కుమార్ ఆరోపించారు. శుక్రవారం సిరిగిందలపాడులో ఉపాధి హామీ కార్మికులను కలుసుకుని మాట్లాడిన ఆయన, ఈ పథకం అనేక పోరాటాల ఫలితమని, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రధాన ఆసరాగా మారిందని తెలిపారు. పథకం పేరు మార్చడం, నిధులు తగ్గించడం సరికాదని, పథకం పేరును కొనసాగించేందుకు సీపీఐ ప్రచారం నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్