అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలోని పాములేరు వాగులో గల్లంతైన సాధిష్ మృత దేహం ఆదివారం లభ్యమైందని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. రాళ్లలో చిక్కుకున్న మృతదేహాన్ని 24 గంటలపాటు శ్రమించి అతి కష్టం మీద బయటకు తీశామన్నారు. రెండు మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించామన్నారు. వాగుల వద్ద ఎవరు దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.