క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శిరీష దేవి

గంగవరంలో దైవ సేవకులు బి. సంతోష్ అధ్యక్షతన జరిగిన గ్రాండ్ ఐక్య క్రిస్మస్ వేడుకలకు రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీష దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యేసు క్రీస్తు బోధనలు ఆదర్శనీయమని, సేవకులు సమాజ సేవలో మరింత బాధ్యతగా పనిచేయాలని ఆమె సూచించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలుముల అక్కమ్మ, జడ్పీటీసీ బేబీ రత్నం, మాజీ ఎంపీపీ తీగల ప్రభ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్