అంగుళూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని గండి పోచమ్మ ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న పాలకొల్లుకు చెందిన 15 మంది ప్రయాణికులతో కూడిన టాటా మ్యాజిక్ వాహనం అంగుళూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలవరం ప్రాజెక్టు అంబులెన్స్ ద్వారా పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్