పింఛన్లు ఇంటింటికీ.. ఎమ్మెల్యే శిరీషాదేవి పంపిణీ

రాజవొమ్మంగి మండలం సింగంపల్లిలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 62.47 లక్షల మందికి ప్రతి నెలా రూ. 2720.67 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్