మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు జ్యోతి మృతదేహానికి శుక్రవారం సాయంత్రం పంచనామా పూర్తయింది. అధికారులు ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా, వారు తమ స్వగ్రామానికి తరలించారు. ఈరోజు మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలకు పంచనామా నిర్వహించే అవకాశం ఉంది. మిగిలిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు రేపు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.