అడ్డతీగల లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్

అడ్డతీగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య సేవలు అందించారు. డాక్టర్ సతీష్ మాట్లాడుతూ, ప్రసవానికి ముందు సంరక్షణే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు. డాక్టర్ పి. మహేష్ రెడ్డి ఈ పథకం 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు. కౌన్సిలర్ నారే వాసు పోషకాహారంపై అవగాహన కల్పించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్