ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ప్రోటోకాల్ అవమానం

రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో జరిగిన P4 వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్‌కు కేటాయించాల్సిన మధ్య సీటు ఇవ్వకుండా చివరన కూర్చోబెట్టడం గిరిజనులకు అవమానమని ఆయన అన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్