మంగళవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు నాయకుడు హిడ్మా, అతని భార్య రాజే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. రాత్రి సుమారు 12 గంటలకు మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.