దేవీపట్నం మండలంలోని గంగంపాలెం సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కొనసాగుతోంది. గురువారం ఉదయం కొండపై పులి ఉన్నట్లు సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం నుంచి అటవీశాఖ అధికారులు, రెస్క్యూ బృందాలు పులి కదలికలను గమనిస్తున్నాయి. అధికారులు వస్తున్నారని తెలిసి పులి కొండపైనే తలదాచుకుని ఉండవచ్చని గిరిజనులు భావిస్తున్నారు. పులి సంచారంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.