యూనివర్సిటీ సమస్యలపై వీసీతో ఆదివాసీ సంఘం చర్చలు

విజయనగరంలో తాత్కాలిక భవనంలో నడుస్తున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర బృందం సందర్శించింది. వీసీ ఆచార్య టి. శ్రీనివాసన్‌, రిజిస్ట్రార్ జితేంద్ర కుమార్ మిశ్రాలతో సమావేశమై, శాశ్వత భవనాలు, సిబ్బంది, ల్యాబ్‌లు, గ్రంథాలయాల కొరతపై సమస్యలను వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి శాశ్వత భవనాలకు యూనివర్సిటీని తరలిస్తామని వీసీ హామీ ఇచ్చారు. అనంతరం మెంటాడ మండలం కుంతినవలసలో నిర్మాణంలో ఉన్న శాశ్వత క్యాంపస్‌ను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్