మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన యువత ర్యాలీ

బుధవారం, రంపచోడవరం లోని అల్లూరి ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రంపచోడవరం నుండి అంబేద్కర్ సెంట్రల్ వరకు సాగింది. ఈ సందర్భంగా 'మావోయిజం గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అమాయక గిరిజనులను మావోయిస్టులు మతం మారుస్తున్నారని, బస్సులు దహనం చేసి రవాణా సౌకర్యాన్ని అడ్డుకుంటున్నారని, రోడ్లు నిర్మిస్తున్న యంత్ర పరికరాలను కాల్చివేసి అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారని ఫ్ల కార్డులతో నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్