బోట్లు, వలలు ఇవ్వాలని గిరిజనుల వేడుకోలు

అనంతగిరి మండలం చిలకలగడ్డ పంచాయతీ మెట్టపాలెం గ్రామానికి చెందిన గదభ పీవీటీజీ గిరిజన మత్స్యకారులు మంగళవారం తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయిన తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. గత 50 ఏళ్లుగా గోస్తని నదిలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నామని, 2023లో బోట్లు, వలలు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని, ఇప్పటికైనా తమకు బోట్లు, వలలు అందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్