సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరడంతో విశాఖ నగరంలోని రవాణా ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధాన రైల్వేస్టేషన్ పండుగ రద్దీతో జనసంద్రంగా మారింది. ఉద్యోగాల నిమిత్తం విశాఖకు వచ్చిన గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం వాసులు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. విజయవాడ, శ్రీకాకుళం, రాయగడ వైపు వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే రత్నాచల్ రైలు కూడా రద్దీగా ఉన్నట్లు సమాచారం.