తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద సోమవారం ఒక కారు, బైక్‌ను ఢీకొట్టింది. జీబ్రా క్రాసింగ్ నుంచి బైకర్ అకస్మాత్తుగా రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బైకర్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.