గతంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సొంతంగా 'చంద్రబాబు టైట్లింగ్ యాక్ట్' అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం విమర్శించారు. బంధువులు, అనుకూలురకే ప్రభుత్వ భూములను కట్టబెట్టడమే ఈ చట్టం ఉద్దేశమని ఆయన ఆరోపించారు. విశాఖపట్నంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కూటమి ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని, ముఖ్యంగా ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం సంస్థలకు, మరికొన్ని మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.