ఆనందపురం మండలం బోని గ్రామ సమీపంలోని గోస్తని నదిలో సోమవారం ఉదయం కృష్ణాపురం గ్రామానికి చెందిన కంటుబుక్తా రమణ (57) మృతదేహం లభ్యమైంది. మే 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని రమణ, గెడ్డ దాటే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మరణించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.