విశాఖలో బొలెరో - బస్సు ఢీ

విశాఖ జూ పార్క్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం బొలెరో - బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్