వచ్చే మార్చినాటికి విశాఖ కేజీహెచ్‌లో తల్లిపాల బ్యాంకు

విశాఖపట్నం కేజీహెచ్‌లో వచ్చే మార్చి నాటికి అత్యాధునిక తల్లిపాల బ్యాంకును ప్రారంభించనున్నట్లు ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సంధ్యా దేవి గురువారం ప్రకటించారు. తల్లిపాలు లభించని శిశువులకు ఇది అమృతం లాంటి ఆహారాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. నేషనల్ నియోకాన్ సదస్సులో భాగంగా ఏఎంసీ పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో 'అడ్వాన్స్‌డ్ లాక్టేషన్ మరియు హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్' పై ఒక ప్రత్యేక వర్క్‌షాప్ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్