రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం విశాఖలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. మంగళవారం ఉదయం 8: 40 గంటలకు విమాన మార్గం ద్వారా విశాఖ చేరుకున్నాక, ఉదయం 10 నుండి 11 గంటల వరకు ప్రభుత్వ మానసిక వైద్యశాలలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవన ప్రారంభంలో పాల్గొంటారని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు.