విశాఖ కేజీహెచ్‌లో అగ్ని ప్ర‌మాదం

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) కార్డియాలజీ విభాగంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఎయిర్ కండీషనర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. వార్డులోని రోగులను సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. హాస్పిటల్ సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్