ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు

విశాఖపట్నంలో రుషికొండ బీచ్ రోడ్డులో ఉదయాన్నే ఒక ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే మొత్తం వ్యాపించాయి. అదృష్టవశాత్తు, డ్రైవర్ సకాలంలో బయటకు దూకడంతో, బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్