పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ఈ నెల 20న జరగనుంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి, సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈమేరకు త్వరలోనే ప్రీరిలీజ్ వేదికను ఖరారు చేయనున్నారు. భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ విశాఖ అభిమానులకు తీపి కబురు చెప్పింది.