కెరటాలల్లో చిక్కుకున్న మహిళలను కాపాడిన మెరైన్ పోలీసులు

మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు విశాఖ ఆర్కే బీచ్ కు శనివారం బార్లు తీరారు. పవిత్ర మాఘ సముద్ర స్థానాలు చేస్తుండగా పెద్ద కెరటాల్లో మహిళలు చిక్కు పోయారు. ఒకేసారి ఎక్కువ మంది  స్నానాల్లో పాల్గొనడంతో కింద పడిపోయిన ఓ మహిళ కాలు విరిగి ప్రమాదానికి గురి అయింది.  అక్కడే విధి నిర్వహణలో ఉన్న మెరైన్ పోలీసులు బారువ స్టేషన్ పిసి1927  బి హరిప్రసాద్ రాజు, పోర్ట్ స్టేషన్ పిసి సంతోష్ కుమార్ మహిళలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. వెంటనే108 కు ఫోన్ చేసి హాస్పిటల్ కి తరలించారు. కుటుంబ సభ్యులు పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్