విశాఖలోని 41వ వార్డు పరిధిలోని జ్ఞానాపురంలో నిర్వహించిన స్పౌజ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు క్షేమంగా, సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.