విశాఖలో జాతీయస్థాయి బైక్ రేసింగ్ పోటీలు

విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 7న జాతీయస్థాయి బైక్ రేసింగ్ పోటీలు జరగనున్నాయని శాప్ డైరెక్టర్ రాజా బుధవారం తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా 130 మంది ప్రముఖ రైడర్లతో పాటు, రెండు దేశాల నుంచి అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటారు. పోటీలకు అవసరమైన అనుమతులు లభించాయని, క్రీడాభిమానులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈనెల 7న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రేసింగ్ విన్యాసాలు జరుగుతాయి.

సంబంధిత పోస్ట్