ఒమన్ తీరంలో నౌకపై జరిగిన క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మరణించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సురేశ్ మృతదేహాన్ని వెంటనే స్వదేశానికి తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.