విశాఖ కేజీహెచ్‌లో ప్రాణ‌భ‌యంతో ప‌రుగులుదీసిన రోగులు

విశాఖపట్నం కేజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. రోగుల బంధువుల సహాయంతో కొందరు స్ట్రెచర్‌లపై, మరికొందరు వీల్‌చైర్లలో వార్డుల నుంచి బయటకు వచ్చారు. కేజీహెచ్ సిబ్బంది తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఈ సంఘటనపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్