జాతీయ ఫిష్ ఫార్మర్స్ డే సందర్భంగా పెదజాలరిపేటలో మత్స్యకారులకు 55 ఇంజిన్లు పంపిణీ చేశారు. రూ.45.81 లక్షల విలువైన ఈ ఇంజిన్లకు ప్రభుత్వం రూ.18.32 లక్షల సబ్సిడీ అందించింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చేతుల మీదుగా ఇవి జాలర్లకు అందించారు. బోట్లు, ఇంజిన్లు, వలలు అవసరమైన జాలర్లకు 40 శాతం రాయితీతో అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.