విశాఖ దక్షిణంలో పింఛన్ల పంపిణీ

విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో 29వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ మాజీ స్టాండింగ్ మెంబెర్ ఉరికిటి నారాయణరావు పాల్గొన్నారు. శుక్రవారం నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లబ్ధిదారుల్లో కళ్ళలో ఆనందం కనిపించింది.

సంబంధిత పోస్ట్