విశాఖ: 'ఏయూ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి'

విశాఖ ఏయూ విడుదల చేసిన గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ రోస్టర్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయులుని కలిసి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్