జాతీయ రహదారి లంకెలపాలెం వద్ద మరిడిమాంబ ఆలయం సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఓ లారీ అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. విశాఖ నుంచి అనకాపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు క్రేన్‌ల సహాయంతో లారీని తొలగించారు.