ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్‌ లో చోరీలు

పండగ సెలవుల నేపథ్యంలో ఆదివారం విశాఖలోని ద్వారక RTC కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఈ సమయంలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం వెళ్తున్న మహిళ బ్యాగులోంచి 7 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మరో మహిళ మెడలో నుంచి నల్లపూసల తాడును కూడా దొంగిలించినట్లు సమాచారం. బస్టాండ్‌లో పోలీసుల నిఘా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్