ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కే, 5కే, 10కే రన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ట్రస్ట్ సీఈఓ కె. రాజేంద్ర కుమార్ దశపల్లా హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తలసేమియా బాధితులకు మద్దతు తెలిపే గొప్ప లక్ష్యంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తలసేమియా అనేది జన్యుపరమైన వ్యాధి అని, ఈ వ్యాధిగ్రస్తులలో రక్తం ఉత్పత్తి కాదని వివరించారు.