విశాఖ నగరంలోని బీచ్ రోడ్ ప్రాంతంలో శ్రీ వాసవి మాత పౌర్ణమి శోభాయాత్ర శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రసన్న పాండురంగ స్వామి దేవస్థానానికి చేరుకున్న ఎమ్మెల్యే, ముందుగా స్వామివారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి మాత పౌర్ణమి శోభాయాత్ర పల్లకిని ఆయన కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు.