విశాఖ: జానపద కళారూపాలతో ఎన్టీఆర్, దాసరికి ఘన నివాళి

విశాఖ పౌర గ్రంథాలయంలో విశాఖ రత్న కళాపరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, దాసరి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డప్పు విన్యాసాలు, చెక్కభజన, జానపద నృత్యాలు, శివపార్వతుల వేషధారణలు, ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సినీ దర్శకుడు దుగ్గివలస దివాకర్, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ఆర్టిస్ట్స్ డైరెక్టర్ సన్ మూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కళాకారులను ఎన్టీఆర్–దాసరి పురస్కారాలతో సత్కరించారు. కడప, కాకినాడ, ఏలూరు, రాజాం, శ్రీకాకుళం, పార్వతీపురం వంటి ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్