విశాఖ: పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం: జేసీ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో శనివారం శ్రమదానం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి స్వయంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి, అధికారులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే స్వర్ణాంధ్ర సాకారమవుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్